రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో తిరుపతి వాసి ప్రతిభ

ABN , First Publish Date - 2022-10-03T05:42:44+05:30 IST

స్థానిక బైరాగిపట్టెడలోని సీపీఐ భవన్‌ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ చదరంగం పోటీల్లో తిరుపతికి చెందిన కేఈకే బిల్వనిలయ సత్తాచాటింది.

రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో తిరుపతి వాసి ప్రతిభ
చదరంగం పోటీల విజేతలతో అతిథులు

 తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 2: స్థానిక బైరాగిపట్టెడలోని సీపీఐ భవన్‌ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ చదరంగం పోటీల్లో తిరుపతికి చెందిన కేఈకే బిల్వనిలయ సత్తాచాటింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బాలాజీచౌదరి, శ్రీనివాససూరి, జాఫర్‌వలి ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌కు వివిధ జిల్లాల నుంచి ఆల్‌ క్యాటగిరీస్‌లో 197మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమై ఏడు రౌండ్లు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జేకే.రాజు (ప్రకాశంజిల్లా) ప్రథమ బహుమతిగా రూ.10,116, పి.వెంకటరమణ (మదనపల్లి)ద్వితీయ బహుమతిగా రూ. 8,116, తిరుపతికి చెందిన బిల్వనిలయకు తృతీయబహుమతిగా రూ. 6,116 అందజేశారు. అలాగే మిగిలిన స్థానాల్లో నిలిచిన విజేతలకు నగదు బహుమతితో పాటు, మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సత్త్వ స్కూల్‌ కరస్పాండెంట్‌ ప్రవీణ్‌, ఎస్బీఐ ఏజీఎం జితేంద్ర, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్‌ వై.కాళిదాసు, ఎస్జీఎస్‌ కాలేజ్‌ కామర్స్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ బి.ఉమామహేశ్వరి పాల్గొని విజేతలకు బహుమతులు, మెడల్స్‌ అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ టోర్నమెంట్‌కు చీఫ్‌ఆర్బిటర్‌గా అబ్దుల్‌నబీ, డిప్యూటీ ఆర్బిటర్‌గా ఫణికుమార్‌, షేక్‌పర్వీన్‌, సుధాకర్‌, రాము, వాసుదేవవర్మ మనోహర్‌, ధనుంజయ్‌, డైరెక్టర్‌ సురేష్‌ వ్యవహరించారు. 

Updated Date - 2022-10-03T05:42:44+05:30 IST