ఎంపీల వేతనాలు, అలవెన్సుల తగ్గింపు బిల్లు ఆమోదం

ABN , First Publish Date - 2020-09-18T20:49:24+05:30 IST

పార్లమెంటు సభ్యులు, మంత్రుల వేతనాలు, అలవెన్సులను 30 శాతానికి తగ్గిస్తూ..

ఎంపీల వేతనాలు, అలవెన్సుల తగ్గింపు బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు, మంత్రుల వేతనాలు, అలవెన్సులను 30 శాతానికి తగ్గిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తరఫున తాను బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్టు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతరం సభ శనివారం ఉదయం 9 గంటల వరకూ వాయిదా పడింది.



కాగా, శుక్రవారం రాజ్యసభలో విపక్ష ఎంపీలు తక్షణం ఎంపీ లాడ్స్ ఫండ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రవేశపెట్టిన హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు-2020కు సభ ఆమోదం తెలిపింది. గత సోమవారంనాడు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీతో ముగుస్తాయి.

Updated Date - 2020-09-18T20:49:24+05:30 IST