Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిక్కవోలు షష్ఠి ఉత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

బిక్కవోలు, నవంబరు 26: తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాల ఆహ్వానపత్రికలను శుక్రవారం ఆలయ ఆవరణలో ఉత్సవకమిటీ, అనపర్తి మార్కెట్‌కమిటీ అధ్యక్షుడు జేవీవీ. సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 8వ తేదీ నుంచి 15 వరకూ షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తామని, 9న స్వామి వారి షష్ఠి ఉత్సవం జరుపుతామన్నారు. అదే రోజు స్వామి వారి గ్రామోత్సవం, 10న స్వామి వారి రథోత్సవం జరిపి, 15న భారీ అన్న సమారాధనతో ఉత్సవాలు ముగిస్తామన్నారు. ఉత్సవాల సమయంలో ప్రతిరోజూ షష్ఠి కళావేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు యామసాని రవి లక్ష్మీగణపతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు  తాళ్ల వీర్రాఘవరెడ్డి, ఆలయ అర్చకులు సన్నిధిరాజు సుబ్రహ్మణ్యశర్మ, వైసీపీ నేతలు నల్లబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement