Viral Video: ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై వెళుతూ కళ్ల ముందే అదృశ్యం!

ABN , First Publish Date - 2022-07-20T01:58:12+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

Viral Video: ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై వెళుతూ కళ్ల ముందే అదృశ్యం!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాల ప్రజలు నిలువ నీడ లేక నిరాశ్రయులయ్యారు. పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాగుల మీద కల్వర్టులను దాటడానికి ప్రయత్నించవద్దని స్థానిక అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొంత మంది సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 


తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కల్వర్టుపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని దాటి ముందుకు వెళ్లడానికి ఓ బైక్ రైడర్ ప్రయత్నించాడు. కొద్ది దూరం వెళ్లాక ప్రవాహ తీవ్రత తట్టుకోలేక ఆ యువకుడు బైక్‌తో పాటు నీటిలో మునిగిపోయాడు. ఆ తర్వాత అతడి పరిస్థితి ఏంటనేది తెలియలేదు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే దానిపై సమాచారం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-07-20T01:58:12+05:30 IST