ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఆ పోలీస్ అధికారి ఏం చేయించాడంటే.. వీడియో బయటపడడంతో..

ABN , First Publish Date - 2022-04-29T19:44:22+05:30 IST

ప్రజలను రక్షించాల్సిన కొందరు పోలీసులు అధికార మదంతో వారిని పీడిస్తున్నారు. అమాయకులతో తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఆ పోలీస్ అధికారి ఏం చేయించాడంటే.. వీడియో బయటపడడంతో..

ప్రజలను రక్షించాల్సిన కొందరు పోలీసులు అధికార మదంతో వారిని పీడిస్తున్నారు. అమాయకులతో తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళతో అధికారి మసాజ్ చేయించుకున్నాడు. షర్టు విప్పేసి ఆమె చేత ఒళ్లు పట్టించుకున్నాడు. ఎవరో ఆ ఘటనను వీడియో తీయడంతో అతణ్ని పై అధికారులు సస్పెండ్ చేశారు. 


బీహార్‌‌లోని సహస్రా జిల్లా దాహర్‌ అవుట్‌పోస్ట్‌‌కు ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అక్కడ విధులు నిర్వహించే సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ సిన్హా ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళతో పోలీస్ స్టేషన్‌లోనే బలవంతంగా మసాజ్‌ చేయించుకున్నాడు. షర్ట్‌ను అక్కడే వేలాడదీసి ఆమెతో ఒళ్లు రుద్దించుకున్నాడు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 



ఆ వీడియో వైరల్ కావడంతో ఆ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పై అధికారులు స్పందించారు. సదరు అధికారిపై వేటు వేశారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. 


Updated Date - 2022-04-29T19:44:22+05:30 IST