ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ (Uddhav Thackeray) థాకరేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. థానే (Thane)కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) గ్రూపులో చేరారు. ఈ మేరకు మాజీ మేయర్ నరేష్ ముస్కే (Naresh Muske) సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్‌లోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు.
అనంతరం వారు మాట్లాడుతూ షిండే గ్రూపులో చేరినట్టు ప్రకటించారు. సీఎం షిండే నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని కార్పొరేటర్లు ప్రకటించారు. కాగా, ఉద్ధవ్ థాకరే పక్షాన నిలబడిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా షిండే క్యాంపునకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి