ఎంత పెద్ద పేరో!

ABN , First Publish Date - 2022-01-07T05:30:00+05:30 IST

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన పేర్లు పెట్టుకుంటారు. పుస్తకాల్లో చదివినవి, ఇష్టమైన వ్యక్తులవి, దేవుళ్ల పేర్లు కలిసొచ్చేలా పెట్టుకుంటారు. కానీ అమెరికాకు చెందిన సాంద్రా విలియమ్స్‌ అనే మహిళ మాత్రం తన కూతురు పేరులా..

ఎంత పెద్ద పేరో!

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన పేర్లు పెట్టుకుంటారు. పుస్తకాల్లో చదివినవి, ఇష్టమైన వ్యక్తులవి, దేవుళ్ల పేర్లు కలిసొచ్చేలా పెట్టుకుంటారు. కానీ అమెరికాకు చెందిన సాంద్రా విలియమ్స్‌ అనే మహిళ మాత్రం తన కూతురు పేరులా ప్రపంచంలో మరెవ్వరికీ ఉండకూడదు అనుకుంది. 1019 అక్షరాలున్న పేరు పెట్టి తను అనుకున్నది సాధించింది. ఆ పేరు గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోనూ నమోదయింది.


  ఆ పేరు పిలవాలంటే రెండు నిమిషాల పాటు పద్యం చదివినట్టుగా చదవాల్సిందే! ఆమె పేరులో అక్షరాల సంఖ్య 1019. ఆమె బర్త్‌ సర్టిఫికెట్‌ రెండు అడుగుల పొడవుందంటే ఆమె పేరు ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

  సాంద్రా ఏరి కోరి మరీ ఆ పేరు పెట్టింది. ఆమె కోరుకున్నట్టుగానే ఆ పేరు తన కూతురుతో పాటు ఆమెకు గుర్తింపును తెచ్చి పెట్టింది.

 ఇంతకుముందు అతిపెద్ద పేరు గిన్నిస్‌ రికార్డు జర్మనీకి చెందిన వ్యక్తి  పైన ఉంది. ఆయన పేరులో అక్షరాల సంఖ్య 747. ఇప్పుడా రికార్డును ఈమె బద్దలు కొట్టింది. 1019 అక్షరాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Updated Date - 2022-01-07T05:30:00+05:30 IST