పెద్ద నగరాలకే మొదట 5జీ కనెక్షన్

ABN , First Publish Date - 2021-12-28T01:02:33+05:30 IST

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో 5జీ కోసం స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయి నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్..

పెద్ద నగరాలకే మొదట 5జీ కనెక్షన్

న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ నెట్‌వర్క్ సేవలను తొలుత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పేర్కొంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, గురుగ్రామ్, పూణె, అహ్మదాబాద్ నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు తెలిపారు.


వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో 5జీ కోసం స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయి నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఫార్సులను కోరింది. ట్రాయి తన వంతుగా పరిశ్రమ వాటాదారులతో ఈ సమస్యపై సంప్రదింపులు ప్రారంభించింది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే తొందరలోనే దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-28T01:02:33+05:30 IST