గూగుల్‌ యాప్స్‌ లుక్స్‌లో బిగ్‌ చేంజెస్‌

ABN , First Publish Date - 2022-05-21T06:55:41+05:30 IST

కంటికి ఇంపుగా కనిపించడం అన్నది అంత చిన్న విషయం కాదు. నిత్యం ఉపయోగించే వాటిలో ఇది మరింత అవసరం.

గూగుల్‌ యాప్స్‌ లుక్స్‌లో బిగ్‌ చేంజెస్‌

కంటికి ఇంపుగా కనిపించడం అన్నది అంత చిన్న  విషయం కాదు. నిత్యం ఉపయోగించే వాటిలో ఇది మరింత అవసరం. మనం వేసుకునే దుస్తులు, ధరించే జోళ్ళ వరకు అనేకానేక వెరైటీలను ఆహ్వానించడమే కాదు, అవి పొంది ఆనందిస్తూ కూడా ఉంటాం. ఈ విషయంలో గూగుల్‌ మరింత జాగ్రత్తగా ఉంటుంది. ‘బిగ్‌ స్ర్కీన్‌, బిగ్‌ చేంజెస్‌’ అంటూ ఈ ఏడాది  మొదట్లోనే గూగుల్‌ సంకల్పం చెప్పుకొంది. అందుకు అనుగుణంగానే, లార్జర్‌ టాబ్లెట్‌ స్ర్కీన్స్‌కు సంబంధించి ఆండ్రాయిడ్‌తో అనుభవాన్ని పెంచే యత్నాలు చేపట్టింది. గూగుల్‌కు సంబంధించి పదిహేను వరకు యాప్స్‌లో మార్పులు చేసింది. ఆండ్రాయిడ్‌ టాబ్లెట్స్‌కు ఒకొక్కటిగా చేరనున్నాయి. 


ఆండ్రాయిడ్‌ ఫైల్స్‌ యాప్‌లో నేవిగేషన్‌ సిస్టమ్‌ను మెరుగుపర్చారు. వెర్టికల్‌ ఇంటర్‌ఫే్‌సను అడాప్ట్‌ చేసుకుంటుంది. దీంతో టాబ్లెట్స్‌కు యాక్సెస్‌ చేసుకోవడం సులువు కానుంది. 

గూగుల్‌ కాలిక్యులేటర్‌ రెండు కాలాల వ్యూ కలిగి ఉంటుంది. లేఔట్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. 

ఆండ్రాయిడ్‌ టాబ్లెట్స్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ స్ల్పిట్‌ కాలమ్‌ వ్యూతో ఉంటాయి.  అయితే ఇప్పుడు ఎడమపక్క ఉండే బాటమ్‌ బార్‌తో యాక్సెస్‌ మెరుగవుతుంది. 

ఫ్యామిలీ లింకప్‌ యాప్‌పై ఉండే నేవిగేషన్‌ డ్రాయర్‌ కూడా డిఫరెంట్‌ లుక్‌తో దర్శనం ఇస్తుంది. 

యూట్యూబ్‌ వరకు పెనుమార్పులు ఏవీ లేవు. అయితే ఆప్టిమైజింగ్‌ జాబ్‌ బాగుంది. 


లార్జ్‌ స్ర్కీన్‌ డివైసె్‌సకు వరకు వీడియో కాలింగ్‌ యాప్‌లో సెంట్రలైజ్డ్‌ కంట్రోల్స్‌ ఎక్కువగా ఉంటాయని సమాచారం.

గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లో మార్పులు అంటున్నప్పటికీ అవి ఏమిటి అన్నది తెలియటం లేదు. 

గూగుల్‌ క్రోమ్‌లో ఇప్పటికే టాబ్లెట్స్‌ వరకు డెస్క్‌టాప్‌ అనుభవం ఉనికిలోకి వచ్చింది. క్రోమ్‌లో మల్టీ టాస్కింగ్‌ను టాబ్లెట్స్‌లోనూ మెరుగుపర్చనుంది. 

జీమెయిల్‌కు సంబంధించి టాబ్లెట్స్‌లో ఫోల్డర్స్‌లో టాప్‌లో డ్రాయర్‌ బటన్‌ ఉంటుంది. లేబుల్స్‌ కూడా ఉంటాయి. 

గూగుల్‌ ఫొటోస్‌ రీడిజైనింగ్‌ జరిగింది. రాబోయే నెలల్లో మరికొన్నింటిని జోడించవచ్చు. 

గూగుల్‌ వన్‌ యాప్‌లో నేవిగేషన్‌ డ్రాయర్‌లో మార్పులు ఉంటాయి.

ఆండ్రాయిడ్‌ నేటివ్‌ మెసేజింగ్‌ యాప్‌లో రెండు కాలాల వ్యూ సహా ఇతర ఫీచర్లు ఉంటాయి. 

యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లే లిస్ట్స్‌ రెండు కాలాల వ్యూకి తోడు నేవిగేషన్‌ రైల్‌ ఉంటుంది. ఇది స్ర్కీన్‌పై తక్కువ స్పేస్‌ను తీసుకుంటుంది. 

గూగుల్‌ టాబ్లెట్స్‌లో గూగుల్‌ లెన్స్‌ను గరిష్ఠీకరించనున్నారు. విజువల్‌ సెర్చ్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఆఖర్లో ఇందులోనూ మార్పులు ఉండవచ్చు. 

టాబ్లెట్స్‌లో గూగుల్‌ కేలండర్‌ ఆప్టిమైజేషన్‌ ఎలా ఉంటుందన్నది స్పష్టం కావడం లేదు. ఇప్పటికి ఉన్నదే మంచి అనుభవాన్ని కలుగజేస్తోంది. 

Updated Date - 2022-05-21T06:55:41+05:30 IST