అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌!

ABN , First Publish Date - 2020-07-12T06:55:40+05:30 IST

బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌(78) కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా శనివారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో సాయంత్రం వేళ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు...

అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌!

  • ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్‌ మెగాస్టార్‌
  • తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కూ కరోనా

ముంబై, జూలై 11: బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌(78) కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా శనివారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో సాయంత్రం వేళ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకిన విషయాన్ని అమితాబ్‌ స్వయంగా వెల్లడించారు. ‘నా పరీక్షల ఫలితం పాజిటివ్‌ వచ్చింది. ఆస్పతిలో చేరాను. గత 10 రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని నా మనవి’ అంటూ అమితాబ్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-07-12T06:55:40+05:30 IST