అమల్లోకి రామయ్య దర్శన వేళల కుదింపు

ABN , First Publish Date - 2021-05-11T06:00:34+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కరోనా రక్షణ, భద్రత చర్యలను దేవస్థానం ఈవో బి.శివాజీ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులను స్వామి దర్శనార్థం అనుమతించారు.

అమల్లోకి రామయ్య దర్శన వేళల కుదింపు
రాజగోపురం వద్ద ప్రధాన ద్వారం మూసివేసిన దృశ్యం

ఉద్యోగులకు రోజు విడిచి రోజు విధులు

భద్రాచలం, మే 10: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కరోనా రక్షణ, భద్రత చర్యలను దేవస్థానం ఈవో బి.శివాజీ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులను స్వామి దర్శనార్థం అనుమతించారు. అనంతరం ఆలయంలో స్వామి పూజా కైంకర్యాలు సంప్రదాయబద్దంగా ఆంతరంగికంగా నిర్వహించారు. అలాగే దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 14 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ కావడంతో రక్షణ, భద్రత చర్యల్లో భాగంగా రోజు విడిచి రోజు విధులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజున దేవస్థానం ఏఈవో-1 బి.శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దేవస్థానం ఉద్యోగులు విధులు నిర్వహించారు. మంగళవారం దేవస్థానం ఏఈవో-2 భవానీరామకృష్ణారావు ఆధ్వర్యంలో సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా భక్తుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉండటం, ఆలయంలో స్వామి వారి దర్శన వేళలు కుదించడంతో రామాలయంలో  రెండు రోజులకు ఒకసారి 800 లడ్డూలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2021-05-11T06:00:34+05:30 IST