భద్రాద్రి రామాలయ సన్నిధిలోకి వింత పక్షి

ABN , First Publish Date - 2020-11-29T04:46:22+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలోకి శనివారం వింత పక్షి దర్శనమిచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ రామయ్య సన్నిధిలో సేద తీరినట్లుగా కనిపించిన ఈ వింత పక్షిని భక్తులు ఆసక్తిగా తిలకించారు.

భద్రాద్రి రామాలయ సన్నిధిలోకి వింత పక్షి
భద్రాద్రి రామాలయంలో వింతపక్షి

 ఆసక్తిగా తిలకించిన భక్తులు 

భద్రాచలం, నవంబరు 28: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలోకి శనివారం వింత పక్షి దర్శనమిచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ రామయ్య సన్నిధిలో సేద తీరినట్లుగా కనిపించిన ఈ వింత పక్షిని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ పక్షిని ఎవరు ముట్టుకున్నా ఏమీ అనకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ పక్షిని తమ వెంట తీసుకెళ్లారు. దీనిపై భద్రాచలం డీఎఫ్‌వో బాబు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ పక్షి గుడ్లగూబ జాతిలో ఒక రకం పక్షి అయి ఉంటుందని, ముసలితనం వల్ల, అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు.

 


Updated Date - 2020-11-29T04:46:22+05:30 IST