ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-19T04:23:05+05:30 IST

రాజకీయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, బడుగు బలహీన, మై నార్టీ వర్గాలను ఉన్నత పదవుల్లో నిలిపిన ఎన్‌టీఆర్‌ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని టీడీపీ నా యకులు డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి
వనపర్తిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

వనపర్తి టౌన్‌, జనవరి 18: రాజకీయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, బడుగు బలహీన, మై నార్టీ వర్గాలను ఉన్నత పదవుల్లో నిలిపిన ఎన్‌టీఆర్‌ కు  భారతరత్న అవార్డు ప్రకటించాలని టీడీపీ నా యకులు డిమాండ్‌ చేశారు.  స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతిని మంగళవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ టెకిడిలో గల ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలుల వేసి నివాళి అ ర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్‌టీ ఆర్‌ విగ్రహానికి  నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బొలమోని రాములు, నందిమల్ల అశోక్‌, మాజీ జట్పీటీసీ వెంకటయ్య యాదవ్‌, జమీల్‌, రవి యాదవ్‌, ఎండీ గౌస్‌, నందిమల్ల రమేష్‌, దస్తగిరి, తె లుగా మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద, ఆవుల శ్రీను, చిన్నయ్య యాదవ్‌, నాగన్న యాదవ్‌, కాగితాల లక్ష్మన్న, చిట్యాల బాల రాజు, బాలు నాయుడు, కొత్తగొల్ల శంకర్‌, గంధం రాజు, గోవిందు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తున్న పటేల్‌ పట్వారి వ్యవస్థను రూపు మాపి ప్రజాపాలన తీసుకొచ్చింది నాటి  సీఎం ఎన్‌ టీఆర్‌ అని టీడీపీ మండల అధ్యక్షుడు జోగు శాం తన్న అన్నారు. మండల కేంద్రంతో పాటు  వివిధ గ్రామాల్లో మంగళవారం ఎన్‌టీఆర్‌ వర్ధంతిని  ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గోపాల్‌ పేట, బస్టాండ్‌లో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. పేదలకు పెన్షన్‌, రూ.2 కిలో బియ్యం, దుస్తుల పంపిణీ వంటి  పథ కాలు ప్రవేశపెట్టింది తెలుగు దేశం ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సామేలు, కొండ రాజు, రాంచంద్రయ్య నాయుడు, గడ్డం నాగరాజు, నారాయణరావు, సాంబయ్య, బాలస్వామి, వెంకట స్వామి, అదేవిధంగా బుద్దారం, తాడిపర్తి, ఏదుట్ల, నాయకులు పాల్గొన్నారు.

కొత్తకోటలో..

కొత్తకోట : దివంగత ఎన్టీఆర్‌ వర్ధంతి  వేడుకల ను కొత్తకోటలో టీడీపీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూ లమాలలు వేసి నివాళిఅర్పించారు. రాష్ట్రానికి ఎన్టీఆర్‌ చేసిన సేవలను  కొనియడారు. కార్యక్రమం లో ఆ పార్టీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, జనార్థన్‌ సాగర్‌, బైండ్ల శ్రీనువాసులు, గోకరయ్య, బాదం వెంకటేష్‌, సుధారాణి, కొండన్న, ముమ్మళపల్లి గోపాల్‌, శివ కుమార్‌ నాగరాజు పాల్గొన్నారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు : స్వర్గీయ  మాజీ ముఖ్యమంత్రి నంద మూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను  మం డల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు గోల్డ్‌ బాలస్వామి స్వగృహంలో మంగళవారం ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాజశేఖర్‌, మాధ వరెడ్డి, సీతార వెంకటేశ్వర్లు, యాదగిరిగౌడ్‌, భీష్మ, హరిబాబు, బాలరాజు, జుర్రువెంకటేష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో..

ఆత్మకూరు : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  వర్ధంతి వేడుకలను ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలో టీ డీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బస్టాం డ్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయ కులు రామలక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్‌ రాములు, నా యకులు కొత్తూరు వెంకటేష్‌, గాలిపంపు శ్రీను, కుమార్‌, జగన్‌, మేస్ర్తీ వెంకటన్నతో పాటు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి : ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం వెల్టూరులో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.  కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీపీ అధి కార ప్రతినిధి రాజవర్ధన్‌రెడ్డి, జగత్‌పల్లి హుస్సేన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు బాలరాజు, గుండెల ఆం జనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మదనాపురలో

మదనాపురం : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వ ర్ధంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా  మండ ల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడు తూ బడుగు, బలిహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అద్యక్షుడు మాసన్నయాదవ్‌, ఖాజాపాషా, దశ రథం, రమేష్‌, విజయ్‌రెడ్డి,  పాల్గొన్నారు.

వీపనగండ్లలో...

వీపనగండ : మండలంలోని కల్వరాల, చిన్నంబా వి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కులు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరా మారావు వర్ధంతి వేడుకలు మంగళవారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కల్వరాలలో పార్టీ జెండాను ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుధా కర్‌ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి ఎండి ఎం నాయకులు రమేష్‌, సింధు, సత్యనారాయణగౌడ్‌, ప రశురాం, మహేష్‌, జాఫర్‌, శివ, కల్వరాలలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బిచ్చారెడ్డి, నాయకులు వెంకటేష్‌, శ్రీను, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-19T04:23:05+05:30 IST