టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: భానుప్రకాష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-31T16:59:44+05:30 IST

తిరుమల: అధికార పార్టీ నాయకులకు ఓ నిబంధన... సామాన్య భక్తులకు మరో నిబంధననా...?..

టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: అధికార పార్టీ నాయకులకు ఓ నిబంధన... సామాన్య భక్తులకు మరో నిబంధననా...? అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులతో అన్నమయ్య మార్గంలో వచ్చిన వేలాది మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారని, అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వందలాది కిల్లో మీటర్లు నడిచి వచ్చే భక్తులకు స్వామి వారీ దర్శనం కల్పించాలన్నారు. బ్రేక్ దర్శనాలు తగ్గించైనా సామాన్య భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి శ్రీవారీ దర్శనాన్ని కల్పించాలని కోరారు. కాగా దళిత వాడల్లో నివసించే భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతి మాసం స్వామి వారీ జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంనాడు టీటీడీ దళిత వాడల్లో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించాలని భానుప్రకాష్ రెడ్డి టీటీడీకి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-12-31T16:59:44+05:30 IST