దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డివర్మ కృషి

ABN , First Publish Date - 2022-05-23T04:34:31+05:30 IST

జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డివర్మ అని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్వేత ప్రియదర్శిని అన్నారు.

దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డివర్మ కృషి
కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డివర్మకు నివాళ్లు అర్పిస్తున్న కార్యాలయ సిబ్బంది

- జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్వేత ప్రియదర్శిని

- ఘనంగా వర్మ జయంతి 


గద్వాల క్రైం, మే 22: జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డివర్మ అని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్వేత ప్రియదర్శిని అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశపు హాలులో భాగ్యరెడ్డివర్మ 134వ జయంతిని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్‌ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపిన ఉద్యమకారుడని, దళిత పాఠశాలలు స్ధాపించి బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారన్నారు. అహింస సమాజం స్ధాపించి సంఘ సంస్కరణలకు, దళితుల అభ్యున్నతికి గట్టి పునాది వేశారన్నారు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఆయన జీవితాన్ని, సేవలను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో అజామ్‌అలీ, సూపరింటెండెంట్‌ రాజు, వసతిగృహ వార్డెన్లు, కలెక్టరేట్‌ సిబ్బంది ఉన్నారు. 

దళిత చైతన్యానికి ప్రతీక భాగ్యరెడ్డివర్మ

ఇటిక్యాల : అణగారిన వర్గాల సంక్షేమానికి భాగ్యరెడ్డివర్మ చేసిన సేవలు, ఉద్యమాలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలని పదవ పోలీస్‌ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ పోలీస్‌ బెటాలియన్‌లో ఏర్పాటుచేసిన భాగ్యరెడ్డివర్మ 130వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి అనిల్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్ర మంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌లు నాగభూషణం, సత్యనారాయణ, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-23T04:34:31+05:30 IST