పంజాబ్ ముఖ్యమంత్రిగా మాన్ ప్రమాణం

ABN , First Publish Date - 2022-03-16T20:48:16+05:30 IST

ఖట్కర్ కలాన్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు

పంజాబ్ ముఖ్యమంత్రిగా మాన్ ప్రమాణం

ఖట్కర్ కలాన్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ గ్రామంలో ఆయన చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర ఆప్ నేతలు హాజరయ్యారు. అందరూ మాన్ పిలుపు మేరకు పసుపురంగు తలపాగాలు ధరించి వచ్చారు. రంగ్ దే బసంతి థీమ్‌తో ఖట్కర్ కలాన్ గ్రామం కళకళలాడుతోంది. భగత్ సింగ్‌కు స్వాతంత్ర్యం వస్తుందా రాదా అనేదానికన్నా వచ్చిన స్వాతంత్ర్యాన్ని భారత్ ఎలా నిలుపుకోగలదనే విషయంపైనే ఎక్కువ చింత ఉండేదని ఈ సందర్భంగా మాన్ వ్యాఖ్యానించారు. కొత్తగా ఎంపికైన ఆప్ ఎమ్మెల్యేలు అహంకారంతో ఉండరాదన్నారు. ఓటు వేయనివారితో కూడా గౌరవంగా నడుచుకోవాలని సూచించారు.             




ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 117 స్థానాలకు గాను 92 సీట్లలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఆప్ ధాటికి సిద్ధు, కెప్టెన్ అమరీందర్ సింగ్, సీఎం చన్నీ, బాదల్ ద్వయం సహా పలువురు కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. 

Updated Date - 2022-03-16T20:48:16+05:30 IST