భగ్గుమన్న భానుడు

ABN , First Publish Date - 2021-06-22T05:34:22+05:30 IST

మండు వేసవిని తలపించేలా సోమవారం ఎండ మండడంతో ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల ప్రజలు అల్లాడి పోయారు.

భగ్గుమన్న భానుడు
ఎండ ధాటికి బోసిపోయి కనిపిస్తున్న ఎలమంచిలి ప్రధాన జంక్షన్‌

  

  నిప్పుల కుంపటిలా నాలుగు మండలాలు

 ఉదయం తొమ్మిది గంటలకే వడగాడ్పులు

 బోసిపోయిన ప్రధాన రహదారులు

ఎలమంచిలి/రాంబిల్లి, జూన్‌ 21: మండు వేసవిని తలపించేలా సోమవారం ఎండ మండడంతో ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల ప్రజలు అల్లాడి పోయారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన వేడి వాతావరణం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. దీనికి తోడు వడగాడ్పులు మరింత భయపెట్టాయి. దీంతో మధ్యాహ్నం పనెండు గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కర్ఫ్యూ సడలింపు సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నా జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఎలమంచిలి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే  ప్రధాన జంక్షన్లు సైతం ఎండ ధాటికి బోసిపోయాయి.  ఉక్కపోత కారణంగా చంటిపిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రుతుపవనాల ఆగమనం వేళ వర్షాలు కురుస్తాయని ఆశించిన సమయంలో భానుడు ఇలా భగ్గుమనడంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated Date - 2021-06-22T05:34:22+05:30 IST