భగత సింగ్‌ పాఠ్యాంశం తొలగింపు సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2022-05-18T06:25:46+05:30 IST

కర్ణాటకలో పదో తరగతి పాఠ్యపుస్తకాల్లోంచి భగత సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించి ఆర్‌ఎ్‌సఎస్‌ చేత హెగ్డేవార్‌ పాఠాన్ని చేర్చడం సరైంది కాదని ఎస్‌ఎ్‌ఫఐ మండల కార్యదర్శి బండ్ల పవనకల్యాణ్‌ అన్నారు.

భగత సింగ్‌ పాఠ్యాంశం తొలగింపు సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ
మాట్లాడుతోన్నఎస్‌ఎ్‌ఫఐ మండల కార్యదర్శి బండ్ల పవనకల్యాణ్‌

రామన్నపేట, మే 17: కర్ణాటకలో పదో తరగతి పాఠ్యపుస్తకాల్లోంచి భగత సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించి ఆర్‌ఎ్‌సఎస్‌ చేత హెగ్డేవార్‌ పాఠాన్ని చేర్చడం సరైంది కాదని ఎస్‌ఎ్‌ఫఐ మండల కార్యదర్శి బండ్ల పవనకల్యాణ్‌ అన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను తృణ ప్రాయం చేసిన భగత సింగ్‌ జీవితాన్ని నేటి తరం విద్యార్థులు చదవకుండా, మహాత్మాగాంఽధీని హత్య చేసిన ఆర్‌ఎ్‌సఎస్‌ లాంటి వివాదాస్పద నాయకుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రేరేపించి, విద్య కాశాయీకరణకు పాల్పడుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ మండల అధ్యక్షుడు మేకల జలెందర్‌, మండల నాయకులు గన్నెబోయిన ఆదిత్య, బత్తిని సందీప్‌, పోగాకు భగవాన, గట్టు జ్యోతిబసు, గాయత్రి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T06:25:46+05:30 IST