Abn logo
Oct 15 2021 @ 10:46AM

భద్రాద్రి: నిజరూపలక్ష్మి అలంకారంలో శ్రీలక్ష్మి తాయారమ్మ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో  విజయదశమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారమ్మ నిజరూప లక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సాయంత్రం దసరా మండపంలో విజయోత్సవ పూజ, శమీపూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల మహోత్సవం (రావణ వధ) జరుగుతుంది.


కరోనా దృష్ట్యా ఈ నెల 20వ తేదీన సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్రను గత ఏడాది మాదిరిగానే కొంతమంది వైదిక సిబ్బంది, పరిపాలనా సిబ్బందితో  ఆలయ ప్రాంగణంలో నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు రామాలయం ఈవో బి.శివాజీ తెలిపారు.