Abn logo
Sep 1 2021 @ 10:14AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన స్కూల్స్

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో బుధవారం స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 1084 ప్రైమరీ స్కూల్స్, 245 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 312 హై స్కూల్స్ పున:ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థిని విద్యార్థులు స్వల్పంగా హాజరవుతున్నారు.


18 నెలల తర్వాత విద్యాసంస్థలు పున:ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో విద్యా సంస్థలను తిరిగి తెరుచుకోవచ్చవని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా విద్యాసంస్థలను పున:ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.