నేడు భద్రాచలంలో డోలోత్సవం

ABN , First Publish Date - 2022-03-17T13:38:16+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అర్చకులు ఈరోజు డోలోత్సవం నిర్వహించనున్నారు.

నేడు భద్రాచలంలో డోలోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అర్చకులు ఈరోజు డోలోత్సవం నిర్వహించనున్నారు. అలాగే వసంతోత్సవం పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేయనున్నారు. రేపు  హొలీ పౌర్ణమి సందర్భంగా శ్రీసీతారామచంద్ర స్వామివారి కళ్యాణ ఏర్పాట్లకు పసుపు కొట్టం కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

Updated Date - 2022-03-17T13:38:16+05:30 IST