జిల్లా ఆస్పత్రిలో జ్వరాలకు మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2021-10-20T06:02:49+05:30 IST

స్థానిక జిల్లా ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నాయనీ, జ్వరాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం, జిల్లా ఇనచార్జి వైద్యాధికారి డాక్టర్‌ రా మసుబ్బారావు.. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఆస్పత్రిలో జ్వరాలకు మెరుగైన వైద్యం
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ జగన్నాథం, జిల్లా ఇనచార్జి వైద్యాధికారి రామసుబ్బారావు

 ప్రైవేట్‌కు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడొద్దు 

 సూపరింటెండెంట్‌, జిల్లా ఇనచార్జి వైద్యాధికారి

అనంతపురం వైద్యం, అక్టోబరు 19 : స్థానిక జిల్లా ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నాయనీ, జ్వరాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం, జిల్లా ఇనచార్జి వైద్యాధికారి డాక్టర్‌ రా మసుబ్బారావు.. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆస్పత్రిలోని చాంబర్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సీజనల్‌ జ్వరాలు పెరిగిపోయాయన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ ఇతరత్రా జ్వరాల బారిన జనం పడుతున్నారన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే.. అక్కడ డెంగ్యూ అని చెప్పి, ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని బెదిరించి ఎక్కువ ఫీజులు దండుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లా సర్వ జనాస్పత్రిలో డెంగ్యూతోపాటు ఇతర జ్వరాలకు అవసరమైన పడకలు, మందులు, ప్లేట్‌లెట్స్‌ ఉచితంగా ఇస్తామన్నారు. వైరల్‌ ఫీవర్స్‌ వచ్చినపుడు ప్లేట్‌లెట్స్‌ తగ్గుతుంటాయనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్‌ లెక్కింపునకు ప్రత్యేక పరికరం ఏర్పా టు చేశామనీ, ఎస్‌డీపీతోపాటు ర్యాండమ్‌ ప్లేట్‌లెట్స్‌ ఉచితంగా ఇస్తామన్నారు. ప్రైవేట్‌కు వెళ్లి, ఆర్థిక ఇబ్బందులు పడొద్దని సూ చించారు. ఎలీసా విధానంలోనే డెంగ్యూను నిర్ధారించా ల్సి ఉం టుందన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు కిట్లతో పరీక్షలు చే సి, డెంగ్యూ ఉందని చెబుతున్నారనీ, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయని అ లాంటి ఆస్పత్రుల యాజమాన్యాలు, ల్యాబ్‌లపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు సర్వజనాస్పత్రిలో అందే ఉచిత నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2021-10-20T06:02:49+05:30 IST