ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-08-19T05:44:43+05:30 IST

ప్రజలకు మెరు గైన సేవలు అందించేందుకు ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయో గించుకోవాలని ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి అన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బలరాం

ఎమ్మెల్యే కరణం బలరాం

చీరాల, ఆగస్టు 18: ప్రజలకు మెరు గైన సేవలు అందించేందుకు ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయో గించుకోవాలని ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వి విధ శాఖల అధికారులతో జరిగిన స మీక్షా సమావేశంలో ఆయన మాట్లా డారు. నియోజకవర్గం పరిధిలో సచి వాలయాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. అందుకు సంబంధిం చి ఎక్కడెక్కడ ఏఏ దశల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అవ సరమైనచోట స్థలసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఏ శాఖలో కూడా ప్రజలకు సకాలంలో సక్రమైన సేవలు అందటంలేదనే ఫిర్యాదు రాకూడదన్నారు. సేవలు ద్వారా ప్రజల మన్ననలు పొందాల న్నారు. అప్పుడే ప్రభుత్వానికి, అధికారులకు మంచిపేరు వ స్తుందని చెప్పారు. 

అనంతరం వాడరేవు సము ద్రతీరంలో నిరుపయోగంగా ఉన్న రెవెన్యూ అతిథి గృహాన్ని పరిశీలించారు. వెంటనే మర మ్మతులు చేపట్టి వినియోగం లోకి తెచ్చేందుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో సరోజిని, చీరాల, వేటపాలెం  తహసీల్దార్లు ప్రభా కరరావు, సంధ్యశ్రీ, చీరాల మండల ప్రత్యేక అధికారి మదన్‌మోహన్‌ గుప్తా, ఎంపీడీవో నేతాజీ, పంచాయితీరాజ్‌ డీఈ శేషయ్య, ఆర్‌అండ్‌ బీ డీఈ నరసింహులు, మున్సిపల్‌ డీఈఈ ఏసయ్య,  గ్రామ కార్యదర్శి చక్రవర్తి, నాయకులు ఎరిపిల్లి రమణ, మచ్చా సువార్త, శ్రీనివాసరెడ్డి, గ డ్డం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T05:44:43+05:30 IST