బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2020-08-15T09:17:14+05:30 IST

పేదలు బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌


సైదాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పేదలు బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. శుక్రవారం సంతో్‌షనగర్‌ సర్కిల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, మేయర్‌ రామ్మోహన్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీలతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌లో ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకే కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటు గా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌, మహమూద్‌ అలీలకు బీపీ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో యాఖత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రీ, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సామ సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


రామంతాపూర్‌ రాంరెడ్డినగర్‌లో...

రామంతాపూర్‌: ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని హబ్సిగూడ డివిజన్‌  రామంతాపూర్‌ రాంరెడ్డినగర్‌లో బస్తీ దవాఖానాను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.


కుర్మగూడ డివిజన్‌లో...

కుర్మగూడ డివిజన్‌ మాదన్నపేట, వికా్‌సనగర్‌లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను హోంమంత్రి మహమూద్‌ అలీ ఎమ్మెల్యే పాషాఖాద్రీతో కలిసి ప్రారంభించారు. 


అడిక్‌మెట్‌ డివిజన్‌లో

రాంనగర్‌ : అడిక్‌మెట్‌ డివిజన్‌లోని పోచమ్మబస్తీలో బస్తీ దవాఖానాను  మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ బి.హేమలతరెడ్డిలతో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు పాల్గొన్నారు. 


గాంధీనగర్‌లో..

ముషీరాబాద్‌ : బోలక్‌పూర్‌ డివిజన్‌ గాంధీనగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌,  కలెక్టర్‌ శ్వేతామహంతి, హెచ్‌ఎం అండ్‌ హెచ్‌డబ్ల్యూ కార్యదర్శి ఎస్‌ఎం రిజ్వితో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు బస్తీ దవాఖానాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 


గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో..

మంగళ్‌హాట్‌: గన్‌ఫౌండ్రీ డివిజన్‌ పరిధిలోని గాడీఖానాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్పొరేటర్‌ మమత సంతోష్‌ గుప్తాలతో కలిసి  మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. 


పాతబస్తీలో..

మదీన: పాతబస్తీ పరిధి దూద్‌బౌలిలో, రమ్న్‌సపురా మోచీ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి మహమూద్‌ అలీ ఎమ్మెల్యే మౌజంఖాన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లతో కలిసి ప్రారంభించారు. కిషన్‌బాగ్‌ అల్లా మసీదు కమ్యూనిటీ హాల్‌లో, కామాటిపురా బొందలగడ్డ ప్రాంతంలో బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మౌజంఖాన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ ప్రారంభించారు.


భూపేష్‌ గుప్తానగర్‌ కాలనీలో..

వనస్థలిపురం: హస్తినాపురం డివిజన్‌, భూపేష్‌ గుప్తానగర్‌ కాలనీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్‌, కార్పొరేటర్‌ పద్మానాయక్‌తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడి శుక్రవారం బస్తీ దవాఖానాను ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, జిల్లా డిప్యూటీ వైద్య అధికారి విజయ కృష్ణ, కార్పొరేటర్‌ రమాణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 


హయత్‌నగర్‌ వీరన్నగుట్ట వద్ద...

హయత్‌నగర్‌: మన్సూరాబాద్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ వీరన్నగుట్ట వద్ద బస్తీ దవాఖానాను ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హయత్‌నగర్‌ సర్కిల్‌ డీసీ మారుతీదివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  


శారదానగర్‌లో..

రామంతాపూర్‌ డివిజన్‌ శారదానగర్‌లో బస్తీ దవాఖానాను మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి, కార్పొరేటర్‌ జ్యోత్స్న ప్రారంభించారు. రాంరెడ్డినగర్‌ బస్తీ దవాఖానా ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ యోగితారాణా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, కార్పొరేటర్లు స్వప్నారెడ్డి, అనలారెడ్డి, జ్యోత్స్న, సరస్వతి, దేవేందర్‌రెడ్డి, ఆలకుంట సరస్వతి తదితరులు పాల్గొన్నారు. 


ఏఎ్‌సరావునగర్‌లో..

ఏఎ్‌సరావునగర్‌: ఏఎ్‌సరావునగర్‌లో బస్తీ దవాఖానాను ఉప్పల్‌ ఎమ్మె ల్యే భేతి సుభా్‌షరెడ్డితో కలిసి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శైలజ, కార్పొరేటర్‌ పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


మౌలాలి డివిజన్‌లో..

మౌలాలి: మౌలాలి డివిజన్‌లోని మహాత్మాగాంధీనగర్‌లో బస్తీ దవాఖానాను మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ముంతాజ్‌ ఫాతిమా, డీసీ దశరథ్‌, తహసీల్దార్‌ గీత, డా.రెడ్డికుమారి, నాయకులు పాల్గొన్నారు.  


కవాడిగూడ డివిజన్‌లో..

కవాడిగూడ: కవాడిగూడ డివిజన్‌లోని భీమా మైదాన్‌ వాంబే కాలనీలో బస్తీ దవాఖానాను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఈఈ రమేష్‌బాబు, సర్కిల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T09:17:14+05:30 IST