రోదసి నుంచి భారత్‌కు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-14T08:42:09+05:30 IST

భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా వ్యోమగామి సమంత..

రోదసి నుంచి భారత్‌కు శుభాకాంక్షలు

ఐఎ్‌సఎస్‌ వ్యోమగామి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం 


న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా వ్యోమగామి సమంత క్రిస్టోఫోరెట్టీ ఒక వీడియో సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంతరిక్ష సంస్థలకు, ముఖ్యంగా నాసాకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అందించిన సహకారాన్ని గుర్తుచేశారు. ‘‘భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాలుగా అనేక పరిశోధనల్లో వివిధ దేశాల అంతరిక్ష సంస్థలకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సహాయ సహకారాలందించింది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మానవ రహిత గగన్‌యాన్‌ మిషన్‌ విషయంలో నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ, ఇతర దేశాల అంతరిక్ష సంస్థలన్నింటి తరపున భారత్‌కు శుభాకాంక్షలు అందజేస్తున్నాను’’ అని సమంత తెలిపారు.

Updated Date - 2022-08-14T08:42:09+05:30 IST