ఆశాజనకంగా నిమ్మ ధరలు

ABN , First Publish Date - 2021-01-25T05:45:59+05:30 IST

మండలంలో 4,500హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ మార్కెట్‌ యార్డు నుంచి నిమ్మకాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

ఆశాజనకంగా నిమ్మ ధరలు
మార్కెట్‌లో నిమ్మకాయలు

 రైతుల మోముల్లో ఆనందం


పొదలకూరు, జనవరి 24 : మండలంలో 4,500హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ మార్కెట్‌ యార్డు నుంచి నిమ్మకాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. గతంలో జనవరిలో అంతగా ధరలు ఉండేవి కావు. కానీ ఈ ఏడాది కోల్‌కతా మార్కెట్‌లో నిమ్మకు మంచి డిమాండ్‌ ఉండడంతో ప్రస్తుతం నిమ్మకాయల బస్తా ధర రూ.1900 నుంచి 2,600 వరకు పలుకుతోంది.  దీంతో మార్కెట్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాయలు వస్తున్నా యి. మార్కెట్‌ యార్డు వారు ఉత్సాహంగా ఎగుమతులు చేపడుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయికి వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నిమ్మకాయల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచే నిమ్మకాయల అధిక ధరలు పలకడంతో నిమ్మరైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. పొదలకూరు మార్కెట్‌ నుంచి 200 బస్తాలతో కూడిన రెండు, మూడు లారీలు ఎగుమతి అవుతున్నాయి. కరోనాతో ఎనిమిది నెలలు చిన్నాభిన్నమైన  రైతులకు నిమ్మధరలు కొంత ఊరటనిస్తున్నాయి. 


Updated Date - 2021-01-25T05:45:59+05:30 IST