Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘కోనాపురంలో జరిగినకథ’ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు

 ఉత్తమ నటుడిగా అనిల్‌ మొగిలి ఎంపిక

ములుగు. నవంబర్‌ 26 : తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తగా పరిచయమైన నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్‌రెడ్డి, పల్లె వినయ్‌కుమార్‌,  అనూష సినిమా పతాకంపై సంయుక్తంగా 2019 లో నిర్మించిన ‘కోనాపురంలో జరిగిన కథ’ సినిమాకు ఉత్తమఅవార్డు లభించింది. కర్ణాటకలోని హుబ్లీ ధార్వాడ్‌ ప్రాంతం లో  ఇటీవల జరిగిన కర్ణాటక ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో నవ కర్ణాటక ఫిలిం అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి ఎంపికైన కోనాపురంలో జరిగిన కథ సినిమాకు ఉత్తమ చిత్రంగా, హీరోగా నూతనంగా పరిచయమై నటించిన అనిల్‌ మొగిలి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్టివల్‌ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బట్టు అంజిరెడ్డి  హీరో అనిల్‌ మొగిలిని అభినందించారు. భవిష్యత్తులో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో గొప్ప హీరోగా ఎదగాలని ఆకాంక్షించారు.  

Advertisement
Advertisement