9 జిల్లాల్లో నిల్‌.. బెంగళూరులో అత్యధిక Covid కేసులు

ABN , First Publish Date - 2021-10-28T16:35:03+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రాజధాని బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయి. బుధవారం 282 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 16 జిల్లాల్లో పదిమందిలోపు నమో

9 జిల్లాల్లో నిల్‌.. బెంగళూరులో అత్యధిక Covid కేసులు

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రాజధాని బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయి. బుధవారం 282 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 16 జిల్లాల్లో పదిమందిలోపు నమోదయ్యారు. అత్యధికంగా బెంగళూరులో 142 మందికి వైరస్‌ సోకింది. 349 మంది కోలుకోగా 13 మంది మృతిచెందారు. గదగ్‌ జిల్లాలో యాక్టివ్‌ కేసులు నిల్‌ కాగా 29 జిల్లాల్లో 8,430 మంది చికిత్సలు పొందుతున్నారు. అత్యధికంగా బెంగళూరులో 6,426మంది, అత్యల్పంగా బాగల్కోటె, రాయచూరులో ఇద్దరు చొప్పున, యాదగిరి, బీదర్‌, హావేరిలలో ముగ్గురు చొప్పున చికిత్సలు పొందుతున్నారు.

Updated Date - 2021-10-28T16:35:03+05:30 IST