బెంగళూరు లిట్ ఫెస్ట్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-19T17:30:07+05:30 IST

బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ (బీఎల్ఎఫ్) 10వ ఎడిషన్

బెంగళూరు లిట్ ఫెస్ట్ ప్రారంభం

బెంగళూరు : బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ (బీఎల్ఎఫ్) 10వ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. కర్ణాటకలో మాట్లాడే భాషల వైవిద్ధ్యాన్ని ప్రదర్శించడంపై ఈ ఉత్సవాల్లో ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గతంలో భారత దేశంలో, అదేవిధంగా ప్రాంతాలవారీగా మాట్లాడే భాషలపై సెషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. 


బీఎల్ఎఫ్ సహ వ్యవస్థాపకుడు శ్రీకృష్ణ రామమూర్తి మాట్లాడుతూ, అనేక భాషలు మాట్లాడేవారు అనేక మంది ఉన్నారని, దీనిపై ఎలా దృష్టి పెట్టాలని తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కర్ణాటకలోని వైవిద్ధ్యాన్ని ప్రదర్శించడం మంచి ఆలోచన అని తాము భావించామన్నారు. గతంలో భారతీయ భాషలు, ప్రాంతాలవారీగా మాట్లాడే భాషలపై సదస్సులు నిర్వహించామన్నారు. బెంగళూరులో 107 భాషలకు చెందినవారు ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయామన్నారు. డెక్కనీ ఉర్దూ, కొంకణి, కొరగ, హలక్కి కన్నడ, వీటి మాండలికాలు, వైవిద్ధ్యాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తామన్నారు. 


రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 160 మంది రచయితలు, వక్తలు మాట్లాడతారని తెలిపారు. చేతన్ భగత్, సానియా మీర్జా, ఆకార్ పటేల్ వంటి ప్రముఖులు పాల్గొంటారన్నారు. ప్రీతి షెనాయ్, సామంత్ సుబ్రహ్మణ్యం, ప్రణయ్ లాల్ వంటి రచయితలతో మాట్లాడి, నచ్చిన అంశాలపై ప్రశ్నలు అడగవచ్చునని తెలిపారు. 


Updated Date - 2021-12-19T17:30:07+05:30 IST