నూతన చట్టం ద్వారా ఓసీ నిరుపేదలకు లబ్ధి

ABN , First Publish Date - 2021-01-25T06:28:49+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రిజర్వేషన్‌ చట్టం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓసీలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించడం అభినందనీయమని ఖానాపూర్‌ ఓసీ జేఏసీ అధ్యక్షుడు అయిల్నేని సంజీవరావు అన్నారు.

నూతన చట్టం ద్వారా ఓసీ నిరుపేదలకు లబ్ధి
ఖానాపూర్‌లో మోదీ, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ఓసీ జేఏసీ నాయకులు

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ఖానాపూర్‌, జనవరి 24: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రిజర్వేషన్‌ చట్టం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓసీలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించడం అభినందనీయమని ఖానాపూర్‌ ఓసీ జేఏసీ అధ్యక్షుడు అయిల్నేని సంజీవరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని తాజాగా తెలంగాణలో అమలు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడంతో అగ్రవర్ణాల్లో పేదకుటుంబాలకు కొండంత అండ లభించినట్లైందన్నారు. కులం, మతం ప్రాతిపాదికన కాకుండా ఓ కుటుంబం ఆర్థిక స్థితిగతులతో రిజర్వేషన్‌లు కల్పించడం పట్ల సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రెడ్డి, గన్నారపు రాజేందర్‌, వెంకటప్పయ్య, లక్ష్మణ్‌రావు, కొండాడి గంగారావు, సతీ్‌షరావు దేశ్‌పాండే, అవ్వ భుచ్చన్న, సంతోష్‌, పడిగెల అశోక్‌, రమణా ప్రశాంత్‌, ఆనంద్‌ పంతులు, శశిధర్‌శర్మ, కీర్తిరాఘవశర్మ, అశోక్‌రావు, బ్రహ్మయ్య, సుదర్శన్‌ తదితరులు ఉన్నారు.

లోకేశ్వరం: ఓసీలకు పది శాతం రిజర్వేషన్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌రావు మాట్లాడుతూ ఓసీలకు పదిశాతం రిజర్వేషన్‌ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఇందులో వైస్‌ ఎంపీపీ మామిడి నారాయణ్‌రెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:28:49+05:30 IST