లబ్ధిదారుల గుండె చెరువే

ABN , First Publish Date - 2020-07-12T09:44:16+05:30 IST

దూరపు ఆలోచన మరచి నివేశన స్థలాల పంపిణీకి అధికారులు చేపడుతున్న చర్య లు లబ్ధిదారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.

లబ్ధిదారుల గుండె చెరువే

ముసునూరు, జూలై 11: దూరపు ఆలోచన మరచి నివేశన స్థలాల పంపిణీకి అధికారులు చేపడుతున్న చర్య లు లబ్ధిదారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ము సునూరు మండలంలో వివిధ గ్రామాల్లో నివేశనస్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల గుర్తింపునకు అధికారుల మొగ్గుచూపారు. వాటిలో చెక్కపల్లిలో బాపన్నకుంట కొత్త చెరువు, లోపూడి ధర్మకోనేరు చెరువు గోపవరంలోని వాగు భూములను ఎంపికచేసి లక్షలాది రూపాయలు వెచ్చించి సదరు చెరువులను పూడ్చారు. వారం నుంచి పడుతున్న వర్షాలకు సదరు భూములు తిరిగి చెరువులను తలపించ డంతో గ్రామస్థులు ప్రభుత్వం పంపిణీ చేయ తలపెట్టిన నివేశనస్థలాలపై పెదవి విరుస్తున్నారు. చెరువులను అభివృద్ధి చేసే సమయంలో సదరు చెరువుల్లోకి నీటిని తీసుకువచ్చే సప్లై చానల్స్‌ను దారి మళ్లించకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి మున్ముందు ఏర్పడితే నివేశనస్థలాల్లో గృహాలను నిర్మించుకునే పరిస్థితి ఉండదని, లబ్ధిదారులు వాపోతున్నారు. 


నాడు తవ్వారు.. నేడు పూడ్చారు...

డార్క్‌ ఏరియాలో ఉన్న ముసునూరు మండలంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే ఉద్దేశంతో ప్రతి చెరువును కోట్లా ది రూపాయలతో పూడికలు తీశారు. చెక్కపల్లి బాపన్న కుంట కొత్తచెరువును సైతం నీరు-చెట్టు ద్వారా అభివృద్ధి చే శారు. నేటికీ మండలం డార్క్‌ ఏరియాలోనే కేంద్ర పభు త్వం ఉంచుతూ భూగర్భ జలాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చివరికి వ్యవసాయ బోర్లకు చలానాలు కట్టిన రైతులకు సైతం విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయని పరి స్థితిలో చెరువులను స్థలాల పేరుతో పూడ్చడంపై మండలం లోని రైతుల నుంచి ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2020-07-12T09:44:16+05:30 IST