జీలుగ సాగుతో రైతుకు మేలు

ABN , First Publish Date - 2022-05-27T06:41:25+05:30 IST

కొద్దిరోజుల్లో వానాకా లం సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడంలో నిమగ్నమయ్యా రు. భూసాంద్రత, వాటిలోని పోషకాలను పెంచడం కోసం గతంలో రైతులు పశువుల ఎరువును సంప్రదా య ఎరువులుగా పొలాల్లో వేసి కలియదున్నేవారు.

జీలుగ సాగుతో రైతుకు మేలు
సూర్యాపేట లోని తెలంగాణ సీడ్స్‌ గోదాంలో పంపిణీ కి సిద్ధంగా ఉన్న జీలుగ విత్తనాల బస్తాలు

భూసారం పెంచే జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలు సిద్ధం

అవగాహన లేక రసాయనిక ఎరువుల వినియోగం

సంప్రదాయ ఎరువుల వాడకంతో భూసారం పెరిగే అవకాశం

సబ్సిడీ ధరలకే లభిస్తున్న విత్తనాలు


సూర్యాపేట సిటీ, మే 26 : కొద్దిరోజుల్లో వానాకా  లం సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడంలో నిమగ్నమయ్యా రు. భూసాంద్రత, వాటిలోని పోషకాలను పెంచడం కోసం గతంలో రైతులు పశువుల ఎరువును సంప్రదా య ఎరువులుగా పొలాల్లో వేసి కలియదున్నేవారు. ప్రస్తుతం సంప్రదాయ ఎరువుల స్థానంలో రసాయన ఎరువులు ఉపయోగం ఎక్కువ అవుతుంది. దీంతో వ్యవసాయ భూములు వాటి సహజ లక్షణాలను కోల్పోయి, భూమిలోని సూక్ష్మపోషకాలు చనిపోతున్నాయి. విపరీతంగా రసాయనిక ఎరువులు ఉపయోగించడంతో సాగు భూములు కలుషితం అవుతున్నాయి. సారం కోల్పోయిన భూముల్లో మంచి దిగుబడులు వచ్చేలా చేయాలంటే సంప్రదాయ ఎరువులైన జీలుగ, పచ్చిరొట్ట, పిల్లిపెసర వంటి వాటిని పంటకు ముందు భూములలో పెంచితే భూసారం పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఈ విత్తనాలను సరఫరా చేస్తున్నా, రైతులకు వాటి వినియోగంతో కలిగే లాభాలపై సరైన అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ(టీఎస్‌ సీ డ్స్‌) వానాకాలం సీజన్‌లో రైతులకు సరిపోను విత్తనాలను సిద్ధంగా ఉంచింది. సూర్యాపేట జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలలో విత్తనాలను సిద్ధంచేశారు. జిల్లావ్యాప్తంగా 6,585 క్వింటాళ్ల విత్తనా లు సరఫరా లక్ష్యంగా పెట్టుకోగా, గురువారం నాటికి 4,471.60 క్వింటాళ్ల విత్తనాలు ఆయా పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం సెంటర్లలో నిల్వ ఉంచినట్లు రాష్ట్ర సీడ్స్‌ ప్రాంతీయ అధికారులు తెలిపారు.


భూసారం పెంచడంలో అగ్రభాగం

సంప్రదాయ ఎరువులుగా ఉపయోగించే జీలుగ, పిల్లిపెసర, జనుము పంటలను వరి సాగుకు ముందు పొలంలో పెంచడం వల్ల భూసారం పెరగనుంది. భూ సారం పెంచడంలో ఇవి అగ్రభాగంలో ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి ఆయా పంటలను సాగు చేసుకోవ డం వల్ల నేల క్షీణతను తగ్గించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. నెల రోజులకు ముందు జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను చల్లుకోవాలి. నాటు వేసే నాటికి పెరిగిన ఆ మొక్కలను పొలంలోనే కలియదున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల గాలిలో ఉండే నత్రజని భూమిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ పంటలు సహకరిస్తాయి. విత్తనాలు జల్లిన నాటి నుంచి 25 నుంచి 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఏపుగా పెరిగిన మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి,  లేదా రోటోవేటర్‌ సహాయంతో కలియదున్నాలి. అనంతరం సూపర్‌ ఫాస్పేట్‌ను దుక్కిలో వేయాలి. సూపర్‌ ఫాస్పేట్‌తో మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులుగా తయారవుతాయి.


సబ్సిడీ ధరలకే లభ్యం

జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకే రైతులకు అందిస్తుంది. 30 కిలోల జీలుగ బస్తా ధర రూ.1,897.50లు ఉండగా ప్రభుత్వం రూ.1,233.30లు విత్తన ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది. మిగిలిన రూ.664.20లు రైతులు చెల్లించాలి. 40 కిలోల జనుము విత్తనాల బస్తా ఖరీదు మొత్తం రూ.3,330లు, ప్రభుత్వ సబ్సిడీ రూ.2,164.40 చెల్లిస్తుంది. రైతుకు బస్తాకు రూ. 1,165.60లు చెల్లించాలి. 20 కిలోల పిల్లిపెసర బస్తా ఖరీదు రూ.1,770లు, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,150.40లు పోగా మిగిలిన రూ.619.60లు రైతులు చెల్లిస్తే సరిపోతుంది. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి హుజూర్‌నగర్‌లోని అన్ని పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలలో గురవారం నాటికి 4.471. 60 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. 


జీలుగతో లాభాలు 

పొలంలో జీలుగను కలియదున్నడం వల్ల అవి నేలకు, ఆపై వేసే పంటలకు విశేషమైన లాభా లు అందిస్తుంది.

ప్రధాన పంట సాగుకు ముందస్తుగా నేలను సిద్ధంచేస్తుంది

జీలుగ సాగుతో మూడు టన్నుల పచ్చిరొట్ట ఎరువులు లభిస్తాయి.

మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్‌ ఫాస్పేట్‌ను అదనంగా అందిస్తాయి.

జింక్‌, మాంగనీసు, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.

నేలలో కరగని మూలకాలను పంటకు  అనుకూలంగా మార్చుతాయి 

నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.

నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

లెగ్యూ జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లతో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.

తుంగ, గరక వంటి కలువు మొక్కలను అడ్డుకుంటుంది.


సంప్రదాయ ఎరువుల విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి : కృష్ణవేణి, తెలంగాణ విత్తన సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతీయ మేనేజర్‌.

భూసారాన్ని పెంచే సంప్రదాయ ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను రైతులు తమ పంటలో ఎరువులుగా ఉపయోగించుకోవాలి. రసాయనిక ఎరువుల ఉపయోగం తగ్గించాలి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌, రైతు ఆగ్రోస్‌ సేవా కేంద్రాలలో విత్తనాలను సిద్ధంగా ఉంచాం. సబ్సిడీ ధరలకు రైతులకు అందిస్తున్నాం.


కేవీకేలో అందుబాటులో బీపీటీ విత్తనాలు 

త్రిపురారం, మే26: మండలంలోని కంపసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రంలో బీపీటీ (సాంబ మసూరి) ఫౌండేషన్‌ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ శంకరయ్య గురువా రం ఒక ప్రకటనలో తెలిపారు. 25 కిలోల బస్తా కు రూ.1100లకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు 7702544771 ఫోన్‌ నెంబరు ను సంప్రదించాలని కోరారు. 


Updated Date - 2022-05-27T06:41:25+05:30 IST