జగన్‌ను నమ్మి ఓట్లు వేసి అభివృద్ధికి దూరమయ్యారు..!

ABN , First Publish Date - 2022-05-16T06:45:48+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, అధికారంలోకి రాకముందు ‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా’ అని చెప్పాడని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ పేర్కొన్నారు.

జగన్‌ను నమ్మి ఓట్లు వేసి అభివృద్ధికి దూరమయ్యారు..!
ప్రజలతో మాట్లాడుతున్న పమిడి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌

ముండ్లమూరు, మే 15 : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, అధికారంలోకి రాకముందు  ‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా’ అని చెప్పాడని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ పేర్కొన్నారు. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు నేడు నిలువునా మోసపో యారన్నారు.  ఆదివారం ఆయన మండలంలోని వేంపాడు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు.  రాష్ట్రంలో కొనసా గుతున్న అవినీతి పాలనకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నా యుడుకు అవకాశం కల్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేయకపోగా అ ప్పుల ఊబిలోకి నెట్టారన్నా రు. గ్రామాల్లో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. కేవలం వాలంటీరు వ్యవస్థను తీసుకు వచ్చి వారి పార్టీ కార్యకర్తలకే ఉపయోగపడే పనులు చేయడం మినహా ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నా రు. ఆయన వెంట రైతు సంఘం అధ్యక్షుడు మేదరమెట్ల వెంకట్రావు, టీడీపీ గ్రామ  అధ్యక్షుడు మేదరమెట్ల కొండలరావు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు గంగినేని శేషగిరిరావు, సుబ్బారావు  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:45:48+05:30 IST