పులుల గణన ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-20T05:11:22+05:30 IST

నాలుగేళ్లకోసారి చేపట్టే పులుల గణన నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవిలో మంగళవారం ప్రారంభమైంది. నేషనల్‌ టైగర్‌ కన్వెన్షన్‌ అథారిటీ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు గణన చేపడతారు.

పులుల గణన ప్రారంభం
పులుల పాదాల నమూనా సేకరిస్తున్న అటవీ శాఖ అధికారులు

అచ్చంపేట, అక్టోబరు 19: నాలుగేళ్లకోసారి చేపట్టే పులుల గణన నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవిలో మంగళవారం ప్రారంభమైంది. నేషనల్‌ టైగర్‌ కన్వెన్షన్‌ అథారిటీ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు గణన చేపడతారు. గతంలో 2018లో గణన చేపట్టగా, 2021-22 సంవత్సరానికి గాను ఇప్పుడు గణన చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్‌టీసీఏ సూచనల మేరకు ఈసారి ప్రత్యేకంగా ఎకొలాజికల్‌ యాప్‌ ద్వారా కార్డియో సర్వే చేపడుతున్నామని డీఎఫ్‌వో కిష్టగౌడ్‌, సర్వే అధికారి ఆదిత్య తెలిపారు. ప్రతీ బీట్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని, పదిహేను కిలో మీటర్లు కాలినడక ద్వారా ఆధారాలను సేకరిస్తామని చెప్పారు.  సర్వేకు సంబంధించి మద్దిమడుగు అధికారి ఆదిత్య బందీపూర్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడని తెలిపారు. గణన విషయంలో అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:11:22+05:30 IST