ప్రియుడితో అటవీ ప్రాంతానికి వెళ్లిన యువతి.. ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన ఇతర యువకులు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-08-20T18:38:16+05:30 IST

యువతి, యువకుడు ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. మనసులోని మాటను వ్యక్త పరుచుకున్నారు. దీంతో వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలోనే ఆ లవర్స్.. సరదాగా కాలక్షేపం చేద్దామని సిటీకి కొంత దూరంలో ఉన్న అటవీ ప్రదేశానికి వెళ్లారు. ఇం

ప్రియుడితో అటవీ ప్రాంతానికి వెళ్లిన యువతి.. ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన ఇతర యువకులు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. మనసులోని మాటను వ్యక్త పరుచుకున్నారు. దీంతో వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలోనే ఆ లవర్స్.. సరదాగా కాలక్షేపం చేద్దామని సిటీకి కొంత దూరంలో ఉన్న అటవీ ప్రదేశానికి వెళ్లారు. ఇంతలో అనూహ్యంగా కొంత మంది యువకులు అక్కడకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హమీర్‌పూర్(Hamirpur town) పట్టణానికి చెందిన యువతీ, యువకుడు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం పట్టణానికి దగ్గర్లో ఉన్న అడవి(Forest)కి కాలక్షేపం కోసం వెళ్లారు. వాళ్లిద్దరూ(Lovers) సరదగా గడుపుతుండగా.. అక్కడకు కొందరు యువకులు ఎంట్రీ ఇచ్చారు. యువకుడని చెట్టుకు కట్టేసి, యువతిని వివస్త్రను చేశారు. అనంతరం ఆమెను లైగింకంగా వేధించారు. ఇద్దరిపై చేయి చేసుకోవడమే కాకుండా.. డబ్బులు ఇస్తేనే వదిలేస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని భయపెట్టారు. దీంతో చేసేదేమీ లేక.. ఆ ప్రేమికులు ఆ దుండగులకు డబ్బులు చేతిలో పెట్టి అక్కడ నుంచి బయటపడ్డారు. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. తాజాగా ఆ ప్రేమికులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అయింది. దీంతో యువతీ, యువకుడు.. పోలీసు(Police)లను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆ అడవీ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Updated Date - 2022-08-20T18:38:16+05:30 IST