డబుల్‌ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-06-07T10:25:25+05:30 IST

నగరంలో డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చే యాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు...

డబుల్‌ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశం

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 6: నగరంలో డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చే యాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు, మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై శనివార ం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించి సమీక్షించారు. నాగారంలో ఫేజ్‌-1లో నిర్మాణం పూర్తయిన 396 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఫేజ్‌-2లో పనులపై సమీక్షించి వెంటనే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని, పనుల్లో వేగం పెంచాలన్నారు. ఫేజ్‌-1లో ఇళ్ల నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో అమర్చాల్సిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సోమవారం నాటికి పూర్తిచేయాల ని విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. అలాగే మంచినీటి కోసం భగీరథ పైప్‌లైన్‌ ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనం తరం అలీసాగర్‌లో పర్యటించి, అమృత్‌ పథకంలో భాగంగా మంజూరైన ఎనిమిది రిజర్వాయర్లు, ఆలీ సాగర్‌, తిలక్‌గార్డెన్‌లో నిర్మించిన రెండు బ్యాలెన్సిం గ్‌ రిజర్వాయర్లు, పైపులైన్ల పనులపై సమీక్షించారు. అలీసాగర్‌ రిజర్వాయర్‌, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు.


అనంతరం కొత్త కలెక్టరేట్‌ బైపాస్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలను పరిశీలించి ఎనిమిది నెలలు గా పనులు నిలిచిపోవడానికి గల కారణాలను విచారించి, మంగళవారం నాటికి ప్రారంభించాలన్నారు.  అనంతరం రైల్వే కమాన్‌ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ను ఆయన పరిశీలించారు. అమృత్‌పథకంలో భాగంగా పట్టణంలో మంజూరైన 133 కి.మీ. పైప్‌లైన్‌కు గానూ 118 కి.మీ. ఏర్పాటు జరిగిందని, శివా రు ప్రాంతాల్లో సర్వే జరిపి, మరో 20 కి.మీ. మేర పైప్‌లైన్లు వేయనున్నామన్నారు. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు 36 ఎంఎల్‌డీ కెపాసిటీతో అలీసాగర్‌, 25 ఎంఎల్‌డీతో మాసాని రిజర్వాయర్‌, 8.17 ఎంఎల్‌డీవో రఘునాథ్‌ ట్యాంకు, 3 ఎంఎల్‌డీతో మంచిప్ప రిజర్వాయర్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌లత, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్డీవో వెంకటయ్య, డీసీవో సింహాచలం, మిషన్‌ భగీరథ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ తిరుపతికుమార్‌, ఆర్‌అండ్‌ బీ అధికారులు పాల్గొన్నారు. 


గ్రామాల్లో చెత్తచెదారం తొలగించాలి

గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య కా ర్యక్రమం పూర్తయ్యే సోమవారంలోగా పిచ్చిమొక్క లు, చెత్తచెదారం లేకుండా శుభ్రం చేయాలని కలెక్ట ర్‌ సి.నారాయణరెడ్డి మండల స్థాయి అధికారులతో పాటు మండల స్పెషల్‌ ఆఫీసర్‌లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పురోగతిపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అధికారు లు అందజేసిన నివేదికలలో ఏమేమి ఉన్నాయో,  దాని ప్రకారం గ్రామాల్లో పనులు పూర్తయి ఉండాల ని, మంగళవారం ప్రతీ మండలానికి ఒక సీనియర్‌ అధికారిని పంపి పనుల పురోగతిపై నివేదికలు తె ప్పించుకొని పరిశీలించి ఎటువంటి తేడాలు ఉన్నా సంబంధిత ఎంపీడీవోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ గ్రామంలో ఒక ఎకరం స్థలం గు ర్తించి పార్కును అభివృద్ధి చేయాలని, ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా పది ఎకరాలలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. దానికి సంబంధించిన నిధులు, నీ ళ్లు, డ్రిప్‌ వంటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. పారుదల లేకుండా నిల్వ ఉన్న నీటి గుంతలు పూ డ్చడం, మురుగు కాల్వల్లో పూడిక తొలగించడం, ప నికిరాని, పిచ్చిమొక్కలు తొలగించడం, గ్రామాల్లో ప్రతిరోజు చెత్తచెదారాన్ని తొలగించి డంపింగ్‌ యా ర్డుకు తరలించడం, ఫాగింగ్‌ చేయడం, నీటి లీకేజీల ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమానికి గుంతలు తీసే పనిని వెంట నే ప్రారంభించాలని సరైన అవసరమైన ప్రాంతాల్లోనే ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటాలని ఫిట్టింగ్‌, ప్లాంట్స్‌, ట్రీగార్డులు వంటివి ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. టాయిలెట్‌లు, ఇంకుడు గుంతలు, శ్మశానం, డంపింగ్‌ యార్డులు, కా ల్వల  పూడికతీత వంటి పనులను  త్వరిత గతిన పూర్తిచేయాలని, తాగునీరు సరఫరా తొందరగా చేయాలన్నారు.   


 ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి

జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, శ్మ శాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, స్మృతి వనాలు, ఓపెన్‌ జిమ్‌లు, పబ్లి క్‌ టాయిలెట్లు నిర్మించడానికి ప్రభు త్వ స్థలాలు గుర్తించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆ దేశించారు. పట్టణ ప్రగతి కార్య క్రమంలో భాగంగా ఆయన శ నివారం తన చాంబర్‌లో జి ల్లా అధికారులతో పాటు మున్సిపాపల్‌ అధికారులతో సమీక్షించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆ దేశాల మేరకు ప్రభుత్వ స్థలాలు గానీ, ప్రభు త్వ ఇనిస్టిట్యూట్‌కు స ంబంధించిన స్థలాల లో గానీ అనువైన ప్రదేశం ఉంటే గు ర్తించి ఆయా మున్సిపాలిటీ లకు అందజే యాలని కలె క్టర్‌ అధికా  రులను ఆదేశించారు.

Updated Date - 2020-06-07T10:25:25+05:30 IST