అమ్మో.. ఎలుగుబంటి

ABN , First Publish Date - 2022-06-24T05:20:47+05:30 IST

ఉద్దానంలో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సం ఇప్పటికీ స్థానికుల్లో మెదులాడుతోంది. ఒకర్ని పొట్టన పెట్టుకొని..ఆరుగుర్ని గాయపరచిన సంగతి తెలిసిందే. చివరకు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి విశాఖ జూకు తరలించే క్రమంలో భల్లూకం మృత్యువాత పడింది. అయితే ఆ ఘటన మరువక ముందే ఉద్దానంలో మరో ఎలుగుబంటి సంచారం ఇప్పుడు స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కిడిసింగి, వజ్రపుకొత్తూరు సమీపంలోని తాడివాడ తోటల్లో గురువారం ఎలుగు సంచరిస్తూ కనిపించింది. దీంతో స్థానికు

అమ్మో.. ఎలుగుబంటి
తోటల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి

ఉద్దానంలో మరో భల్లూకం సంచారం

వజ్రపుకొత్తూరు, జూన్‌ 23: ఉద్దానంలో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సం ఇప్పటికీ స్థానికుల్లో మెదులాడుతోంది. ఒకర్ని పొట్టన పెట్టుకొని..ఆరుగుర్ని గాయపరచిన సంగతి తెలిసిందే. చివరకు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి విశాఖ జూకు తరలించే క్రమంలో భల్లూకం మృత్యువాత పడింది. అయితే ఆ ఘటన మరువక ముందే ఉద్దానంలో మరో ఎలుగుబంటి సంచారం ఇప్పుడు స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కిడిసింగి, వజ్రపుకొత్తూరు సమీపంలోని  తాడివాడ తోటల్లో గురువారం ఎలుగు సంచరిస్తూ కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. నాటి ఘటనలను గుర్తు చేసుకొని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.




Updated Date - 2022-06-24T05:20:47+05:30 IST