Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌


అనకాపల్లి, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత ్యనారాయణ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్‌ ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. నాలుగైదు తేదీల్లో ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు కూడా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేశ్‌, రత్నకుమారి, పచ్చికూర రాము, సిరసపల్లి సన్యాసిరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement