అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-07T05:56:10+05:30 IST

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉండాలి
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

  1. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలి
  2. 15 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండేలా చూడాలి
  3. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశాలు


కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 6: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వారిని 15 రోజుల పాటు వారి హోం ఐసొలేషన్‌లో ఉండేటట్లు చూడాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. స్పందన వచ్చిన దరఖాస్తుల్లో గడువు దాటినవి 34 ఉన్నాయన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. తహసీల్దార్‌ కార్యాలయాలను విజిట్‌ చేసినపుప్పడు స్పందన అర్జీల రిపోర్టును పరిశీలిస్తానన్నారు. రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌,  రేషన్‌ కార్డులు, పేదలందరికీ ఇళ్లు పథకాల దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వీటిపై విశ్లేషించుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. అధికారులు నెలలో రెండుసార్లు మధ్యాహ్న భోజన పథకాన్ని విజిట్‌ చేసి పిల్లలతో పాటు భోజనం చేయాలన్నారు. విద్యార్థులను క్యూలైన్‌లో నిలబెట్టి కాకుండా ఒక హాల్లో కూర్చోబెట్టి భోజనం వడ్డించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు రామసుందర్‌ రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, నారపురెడిద్డ మౌర్య, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు, నేషనల్‌ హైవే స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:56:10+05:30 IST