బాధ్యతగా వ్యవహరించండి

ABN , First Publish Date - 2020-03-31T10:07:17+05:30 IST

దయచేసి వినండి, కరోనా వైరస్‌ తీవ్రతను గుర్తించండి, బాధ్యతగా వ్యవహరించండి, కరోనా కట్టడికి సహకరించండి అంటూ

బాధ్యతగా వ్యవహరించండి

దయచేసి కరోనా కట్టడికి సహకరించండి 

పోలీసులు, అధికారుల అసహనం

కూరగాయలు పంపిణీ చేసిన తులసిరెడ్డి

పులివెందుల రూరల్‌, మార్చి 30: దయచేసి వినండి, కరోనా వైరస్‌ తీవ్రతను గుర్తించండి, బాధ్యతగా వ్యవహరించండి, కరోనా కట్టడికి సహకరించండి అంటూ పోలీసులు పదేపదే చెబుతున్నారు. పులివెందులలో సోమవారం రేషన్‌ దుకాణాలు, మందుల షాపులు, కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాలు, స్టేట్‌ బ్యాంక్‌ వద్ద రద్దీ కనిపించింది. వీటన్నింటి పట్ల పోలీసులు ఓర్పుగా సమాధానం చెబుతున్నారు. 


అనవసరంగా తిరిగితే వాహనాలు సీజ్‌ : సీఐ

యువత ద్విచక్రవాహనాలపై అనవసరం గా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటూ వాహనాలు సీజ్‌ చేస్తామని సీఐ భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. మోటర్‌ సైకిల్‌పై ఒకరే వెళ్లాలన్నారు. ఇప్పటి వరకు 35 వాహనాలకు జరిమానా వేశామన్నారు.    


Updated Date - 2020-03-31T10:07:17+05:30 IST