Abn logo
Dec 1 2020 @ 23:54PM

ప్రజలతో మర్యాదగా వ్యవహరించండి


ఎస్పీ అమిత్‌ బర్దర్‌

రేగిడి, డిసెంబరు 1: పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకం గా మెలగాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సరైన న్యాయం అందిం చేలా పాటుపడాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. ఉంగరాడమెట్ట వద్ద ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా రిసెప్షన్‌లో అందిస్తేన్న సేవలు, స్టేషన్‌ పనితీరును పాలకొండ సీఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం రికా ర్డులను పరిశీలించారు. స్టేషన్‌ ప్రాంగణం పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆరోగ్యకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


 పోలీస్‌ స్టేషన్ల తనిఖీ

పాలకొండ: పాలకొండ, బూర్జ పోలీస్‌ స్టేషన్‌లను ఎస్పీ అమిత్‌బర్దర్‌ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. సర్కిల్‌ కార్యాలయంలో రికార్డు లను తనిఖీ చేసి క్రైమ్‌ రేటును అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు సీఐ శంకరరావు, పాలకొండ, బూర్జ ఎస్‌ఐలు జనార్దనరావు, అప్పారావు ఉన్నారు. 

 

 

Advertisement
Advertisement
Advertisement