పారిశుధ్య వారోత్సవాల్లో భాగం కావాలి

ABN , First Publish Date - 2020-06-05T10:33:24+05:30 IST

పారిశుధ్య వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ ప్రశాంత్‌

పారిశుధ్య వారోత్సవాల్లో భాగం కావాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌


మిర్యాలగూడ రూరల్‌, వేములపల్లి, జూన్‌ 4: పారిశుధ్య వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ పేర్కొన్నా రు. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామాల్లో నర్సరీలు, శ్మశానవాటికలు, పారిశుధ్య పనులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామాల్లో డ్రైనేజీల పూడికతీత, మురుగునీటి నిల్వ తొలగింపు, దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈనెల 20న హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, నిర్దేశించిన సమ యం నాటికి నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


యాద్గార్‌పల్లిలో కుంటచెరువు స్థలంలో సబ్‌స్టేషన్‌ నిర్మించడం సరికాదని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తుండగా, అధికార పార్టీ నాయకులతో వాగ్వా దం జరిగింది. దీంతో కలెక్టర్‌ స్పందించి తగిన విచారణ చేసి చర్య తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమాల్లో డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీవో రోహిత్‌సింగ్‌, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీలు నూకల సరళ, పుట్టల సునీత, జడ్పీటీసీలు తిప్పన విజయసింహారెడ్డి, ఇరుగు మంగమ్మ, వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధని, సర్పంచ్‌లు మజ్జిగపు పద్మ, దుండిగల యాదమ్మ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T10:33:24+05:30 IST