జెండా పండగలో జాగ్రత్త

ABN , First Publish Date - 2022-08-14T04:35:17+05:30 IST

జాతీయ జెండా.. దేశానికి గర్వకారణం. భారతీయులంతా గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాసక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ జెండా వందనం సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. అందుకే జెండా పండుగ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి.

జెండా పండగలో జాగ్రత్త

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
(ఇచ్ఛాపురం రూరల్‌)

జాతీయ జెండా.. దేశానికి గర్వకారణం. భారతీయులంతా గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాసక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ జెండా వందనం సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. అందుకే జెండా పండుగ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ప్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీ డిఫమేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ సింబల్స్‌ యాక్ట్‌ -1971 నిబంధనలు పాటించాలి. ఈ కోడ్‌లో నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండాపై పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండా ఎగురవేయవచ్చు. జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. 2022 జనవరి 26న కొత్త కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు. ఈ ఏడాది జూలై 20న చేసిన సవరణ ప్రకారం ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా.. ఇంటిమీదైనా ఎగురవేయడానికి అనుమతి ఉంది. ఇంతకుముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు మాత్రమే జెండా ఎగురవేసేందుకు అనుమతి ఉండేది. జాతీయ జెండాను పాలిస్టర్‌ ఫాబ్రిక్‌తో తయారు చేయడానికి గత ఏడాది డిసెంబరు 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది.

నిబంధనలు ఇవీ..
- జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయవర్ణం పైకి ఉండాలి.
- జెండాను పైనుంచి కిందకి వేలాడదీయరాదు.
- త్రివర్ణ పతాకానికి సమానంగా కానీ, ఇంకా ఎత్తులో కానీ ఏ ఇతర జెండా ఎగరకూడదు.
- జెండాపై ఏదైనా రాయడం, తొలగించడం చట్ట విరుద్ధం.
- వస్తువులను, భవనాలను మొదలైన వాటిని కప్పేందుకు, అలంకరణ కోసం జెండా ఉపయోగించరాదు.
- ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో.. కాలిబాటలో జెండా వేయరాదు.
- పోల్‌కు చిట్ట చివరనే ఎగురవేయాలి.
- దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.
- వాణిజ్యపరంగా ఉపయోగించరాదు. జెండాపై అగౌరవాన్ని వ్యక్తం చేయరాదు.
- పత్తి, పట్టు లేదా ఖాదీతో  జెండా తయారుచేయాలి. త్రివర్ణ పతాకం  ఎల్లప్పుడూ 3ః2 నిష్పత్తిలో దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. తెల్లని బ్యాండ్‌ మధ్యలో ఉన్న అశోకచక్రంలో 24 ప్లీహములు ఉండాలి.

 

Updated Date - 2022-08-14T04:35:17+05:30 IST