వామ్మో.. బత్తిలి రోడ్డు

ABN , First Publish Date - 2022-08-23T03:45:27+05:30 IST

భామిని మండలం పసుకుడి వద్ద రహదారి దుస్థితి ఇది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద నిర్మించిన వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ కోసం.. భామిని మండలం కాట్రగడ్ద నుంచి వరద కాలువ నిర్మించారు. దారిపొడవునా కాలువలపై వంతెనలు, డైవర్షన్లను ఏర్పాటుచేశారు. గత 16 సంవత్సరాలుగా పనులు కొనసాగుతుండడంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అలికాం-బత్తిలి రహదారి అంటే ప్రజలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో గోతుల్లో నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలు

వామ్మో.. బత్తిలి రోడ్డు

భామిని మండలం పసుకుడి వద్ద రహదారి దుస్థితి ఇది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద నిర్మించిన వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ కోసం.. భామిని మండలం కాట్రగడ్ద నుంచి వరద కాలువ నిర్మించారు. దారిపొడవునా కాలువలపై వంతెనలు, డైవర్షన్లను ఏర్పాటుచేశారు. గత 16 సంవత్సరాలుగా పనులు కొనసాగుతుండడంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అలికాం-బత్తిలి రహదారి అంటే ప్రజలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో గోతుల్లో నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో వాహన చోదకులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దీనిపై వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా రహదారుల మరమ్మతులకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్టు తెలిపారు. 

- భామిని



Updated Date - 2022-08-23T03:45:27+05:30 IST