Hyderabad: బాసర (Basra)లో ట్రిపుల్ ఐటీ (Triple IT) విద్యార్థుల ఆందోళనలపై గవర్నర్ తమిళి సై (Tamili sai) సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు. మరోవైపు బాసర ఘటనపై మంత్రి సబిత (Sabita) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించిన ఆమె వీసీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణమే వీసీ హైదరాబాద్ రావాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ ట్రిపుల్ ఐటీలో కుట్రలు చేస్తోందని మంత్రి సబిత ఆరోపించారు.
బాసర ఆర్జీయూకేటీ - ట్రిబుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా విపక్ష నేతలు, తల్లిదండ్రులు గేటు బయట ఆందోళనకు దిగారు. బాసరకు వచ్చే రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇతరులెవరూ రాకుండా నిజామాబాద్ - భైంసా రూట్లలో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బాసర రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి