మీరేనా సీఎం అంటే ఏం చెప్పను?: బసవరాజ్ బొమ్మై

ABN , First Publish Date - 2021-07-26T01:23:50+05:30 IST

ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మార్పుపై బీజేపీ అధిష్ఠానం అధికార ప్రకటన..

మీరేనా సీఎం అంటే ఏం చెప్పను?: బసవరాజ్ బొమ్మై

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మార్పుపై బీజేపీ అధిష్ఠానం అధికార ప్రకటన ఆదివారం సాయంత్రం 7 గంటల వరకూ వెలువడలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం మార్పుపై ఆదివారం సాయంత్రంలోగా ప్రకటన రాగానే తన నిర్ణయం తెలియజేస్తానంటూ యడియూరప్ప మీడియాకు చెప్పడంతో ఇక మార్పు అనివార్యం కావచ్చనే బలమైన ఊహాగానాలు ఉదయం నుంచీ వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే యడియూరప్ప పాలన భేష్ అంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాగా, ఇవన్నీ ఊహాగానాలేనని, ఇంకా ఎలాంటి అధికార సమాచారం లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి బసవరాజు బొమ్మై తాజాగా మీడియాకు తెలిపారు. ''ఊహాగానాలు వస్తున్నాయి. కానీ అధికారికంగా సమాచారం లేదు. ఏవో ఊహించి మీరు ప్రశ్నలడిగితే నేను సమధానం చెప్పలేను'' అని బొమ్మై పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలున్న వారి జాబితాలో బసవరాజ్ బొమ్మై పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే విషయం ఆయనను అడిగినప్పుడు, ఊహాగానాలకు సమాధానాలుండవని ఆయన మాట దాటవేశారు.

Updated Date - 2021-07-26T01:23:50+05:30 IST