కడలి చెంతన మార్గం..!

ABN , First Publish Date - 2020-07-10T10:14:13+05:30 IST

మండలంలోని బారువ నుంచి గొల్లగండి కడలి తీరంలో సుమారు 100 మీటర్ల రహదారి ఆనవాళ్లను స్థానికులు గురువారం గుర్తించారు.

కడలి చెంతన మార్గం..!

బారువ-గొల్లగండి తీరంలో ఆనవాళ్లు 

తీరం కోతతో బయటపడిన వైనం


సోంపేట రూరల్‌, జూలై 9 : మండలంలోని బారువ నుంచి గొల్లగండి కడలి తీరంలో సుమారు 100 మీటర్ల రహదారి ఆనవాళ్లను  స్థానికులు గురువారం గుర్తించారు. ఇక్కడ గతంలో   పోర్టు ఉన్న సమయంలో రహదారి ఉండేదని, తుఫాన్ల వల్ల సముద్రం ముందుకొచ్చి ఈ మార్గం కనిపించకుండా పోయి ఉంటుందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం సముద్రం కోతకు గురికావడంతో ఆ రహదారి కనిపించినట్లు తెలిపారు. ఇది సముద్రంలోని ఒక మట్టి పొర కావచ్చని  మరికొంతమంది పేర్కొంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న బారువ, గొల్లగండి సోంపేట పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి  పరిశీలించారు. కాగా ఆంధ్రాయూనివర్సిటీ జియాలజి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గార  రాజారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తీరం కోతకు గురికావడంతో రోడ్డు మార్గం బయటపడిందని తెలిపారు. ఇదీ భవిష్యత్‌లో ప్రమాదాలకు సంకేతమని చెప్పారు.  

Updated Date - 2020-07-10T10:14:13+05:30 IST