వక్క సాగుకు అనువుగా ఇక్కడి నేలలు

ABN , First Publish Date - 2021-10-20T04:59:50+05:30 IST

వక్క సాగుకు అనువుగా ఇక్కడి నేలలు ఉన్నాయని, రైతులు శ్రద్ధ పెట్టి సాగుచేస్తే అదనపు ఆదాయాన్ని అందుకోవచ్చని బెంగళూరు బెస్ట్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ చౌడప్ప అన్నారు.

వక్క సాగుకు అనువుగా ఇక్కడి నేలలు
మాట్లాడుతున్న బెంగళూరు బెస్ట్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ చౌడప్ప

 బెంగళూరు బెస్ట్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ చౌడప్ప 

పెదవేగి, అక్టోబరు 19 : వక్క సాగుకు అనువుగా ఇక్కడి నేలలు ఉన్నాయని, రైతులు శ్రద్ధ పెట్టి సాగుచేస్తే అదనపు ఆదాయాన్ని అందుకోవచ్చని బెంగళూరు బెస్ట్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ చౌడప్ప అన్నారు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయానికి తగ్గట్టుగా ఆదాయాన్ని అందుకోవాలంటే అంతర పంటల సాగు ఒక్కటే మార్గమని సూచించారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఉప్పలపాటి చక్రపాణి, కవ్వగుంటలో దావులూరి విజయసారధి సేంద్రియ విధానంలో సాగుచేస్తున్న వక్క, మిరియం తోటలను బెంగుళూరు బెస్ట్‌ యూనివర్శిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ చాన్సలర్‌ చౌడప్ప మాట్లాడుతూ అధిక దిగుబడులకు మూలం విత్తనం ఎంపికే కీలకమన్నారు. విత్తన ఎంపికతో పాటు విత్తనశుద్ధి కూడా ఎంతో అవసరమని అప్పుడే రైతులు ఆశించిన ఆదాయాన్ని అందుకుంటారని ఆయన చెప్పారు. శాస్త్రవేత్త మాధవీలత, దెందులూరు ఏఎంసీ చైర్మన్‌ మేకా లక్ష్మణరావు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T04:59:50+05:30 IST