Vistara విమానం ఇంజన్ ఫెయిల్.. ప్రయాణికులు సురక్షితం

ABN , First Publish Date - 2022-07-06T22:50:38+05:30 IST

బ్యాంకాక్-ఢిల్లీ విస్తారా విమానం ఇంజన్ ఫెయిల్ కావడం ప్రయాణికులను ఆందోళనకు..

Vistara విమానం ఇంజన్ ఫెయిల్.. ప్రయాణికులు సురక్షితం

న్యూఢిల్లీ: బ్యాంకాక్-ఢిల్లీ విస్తారా విమానం (Vistara Flight) ఇంజన్ ఫెయిల్ (Engine fail) కావడంతో ప్రయాణికులను ఆందోళనకు గురయ్యారు. సింగిల్ ఇంజన్‌తో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారంనాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (BKK-DEL‌) మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగిందని విస్తారా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీలో ల్యాండింగ్‌ అయిన తర్వాత పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. ప్రయాణికుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి విమానాన్ని తరలించారని చెప్పారు. డిజీసీఏకు కూడా ఈ విషయం తెలియజేశామని అన్నారు.


కాగా, గత కొద్ది రోజులుగా విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 18 రోజుల్లో ఎనిమిది సార్లు సాంకేతక లోపాలు తలెత్తడంపై స్పైస్ జెట్‌కు ఏవియేషన్ రెగ్యులేషన్ అథారిటీ డీజీసీఏ తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Updated Date - 2022-07-06T22:50:38+05:30 IST