అరటి గెలలకు డిమాండ్‌

ABN , First Publish Date - 2022-08-01T04:37:15+05:30 IST

అరటి గెలల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎప్పుడూ లేనంత రేటు పలుకుతున్నాయి. దిగుబడి లేకపోవం, డిమాండ్‌ కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది.

అరటి గెలలకు డిమాండ్‌
కొల్లిపర మార్కెట్‌లో వేలంలో రూ.1,200 పలికిన అరటి గెలలు

గెల ధర రూ.700 నుంచి రూ.1,200

దిగుబడి తగ్గడమే కారణం

    

కొల్లిపర, జూలై 31: అరటి గెలల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎప్పుడూ లేనంత రేటు పలుకుతున్నాయి. దిగుబడి లేకపోవం, డిమాండ్‌ కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. కొల్లిపర మార్కెట్‌లో గెల ధర రూ.700 నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. మే నెలలో వీచిన పెనుగాలులకు అరటి తోటలు పడిపోయాయి. దీంతో మార్కెట్‌కు గెలలు తక్కువగా వస్తున్నాయి. రోజు 100 నుంచి 150 వరకు గెలలు మించి  మార్కెట్‌కు రావడంలేదు. గతంలో మొదటి రకం  కర్పూర అరటి గెల ధర రూ.200 నుంచి రూ.250, రెండవ రకం రూ100 నుంచి రూ.150 పలికింది. చక్కెరకేళి రూ.100 నుంచి రూ.150 ధర పలికింది. అటువంటిది ప్రస్తుతం మొదటి రకం కర్పూర  అరటి గెల ధర.1000 నుంచి రూ.1200 వరకు, రెండవ రకం రూ.600 నుంచి రూ.800 ధరలు పలుకుతున్నాయి. మూడవ రకం కర్పూర గెల కూడా రూ.350 నుంచి రూ.400,  అదే విధంగా చక్కెరకేళి కూడా మొదటి రకం  రూ.350 నుంచి రూ.450 వరకు ధర పలుకుతుంది.   దీనికి తోడు శ్రావణమాసం కావటంతో అరటి గెలల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 


Updated Date - 2022-08-01T04:37:15+05:30 IST